సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
VZM: లక్కవరపుకోటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 28మంది లబ్దిదారులకి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలకి అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నట్లు తెలిపారు.