9వ ప్యాకేజీ పనులు వెంటనే పూర్తి చేయాలి: మండల రైతులు
SRCL: నిలిచిపోయిన 9వ ప్యాకేజీ పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు రాయిని చెరువు ద్వారా మండలంలోని గొలుసుకట్టు చెరువులను నింపాలని వీర్నపల్లి మండల రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎండిపోతున్న పొలాల రైతులకు మద్దతుగా రేపు రాయిని చెరువులో ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తామన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొని కార్యకమాన్ని విజయవంతం చేయాలని కోరారు.