టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

SRD: తాడ్దాన్‌పల్లి టోల్ ప్లాజా వద్ద ఆదివారం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారాంతం కావడంతో పాటు పెళ్లిళ్ల సీజన్ వల్ల వాహనాల రద్దీ అంచనాకు మించి పెరిగింది. అయితే, టోల్ ప్లాజా వద్ద తగినన్ని కౌంటర్లు తెరవకపోవడంతో వాహనదారులు ఎండలో అరగంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. దీనివల్ల సమయం, ఇంధనం వృథా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.