కాకాణి బెయిల్ రద్దు చేయాలి :సోమిరెడ్డి

కాకాణి బెయిల్ రద్దు చేయాలి :సోమిరెడ్డి

NLR: CM గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కాకాణికి తనను, టీడీపీని తిట్టనిదే తిన్నది అరగదన్నారు. త్వరలో కాకాణి భూదోపిడీని ఆధారాలతో బయట పెడతానన్నారు. రెండునెలలు తప్పించుకు తిరిగి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని జగన్ జిల్లా అధ్యక్షుడు చేశాడన్నారు. YCP నాయాకులకు ఓటమితో బుద్దిరాలేదన్నారు.