భవాని శంకర స్వామికి ప్రత్యేక పూజలు
KDP: చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామంలోని శ్రీ భవాని శంకర స్వామి దేవస్థానంలో నిన్న కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తి వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు స్వామి వారికి పసుపుతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ అలంకరణ దర్శనం కోసం స్థానిక భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక సోమవారాల్లో శివదర్శనం పుణ్యప్రదమని అర్చకులు తెలిపారు.