సంగారెడ్డి: మున్సిపాలిటీలో పనిచేయని బయోమెట్రిక్

సంగారెడ్డి: మున్సిపాలిటీ కార్యాలయంలో హాజరు వేసే బయోమెట్రిక్ పనిచేయడం లేదు. దీంతో కార్యాలయంకు వచ్చే ఉద్యోగులు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు లేకపోవడంతో ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బయోమెట్రిక్ మిషన్‌ను బాగు చేయించాలని కోరుతున్నారు.