మురుగుతో కాలనీవాసుల అవస్థలు

మురుగుతో కాలనీవాసుల అవస్థలు

MBNR: జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. ఆంజనేయ స్వామి ఆలయ వెనుక భాగంలో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన నీటిలో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.