'రేపటి నుంచి ఓపెన్ పరీక్షలు'

KMM: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 20నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో పదో తరగతి విద్యార్థులు 655 మంది, ఇంటర్ అభ్యర్థులు 898 మంది ఉన్నారు.