ఢిల్లీలో పోలీసుల ముమ్మర తనిఖీలు
పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారులపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. పర్యాటక ప్రదేశాలు, మాల్స్, ప్రార్థనా మందిరాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, పారామిలిటరీ దళాలతో పోలీసులు సమావేశాలు చేపట్టారు.