కల్తీపాల ఘటన.. మరొకరు మృతి

కల్తీపాల ఘటన.. మరొకరు మృతి

KKD: కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. రాజమండ్రిలో గత నెలలో వెలుగుచూసిన కల్తీపాల ఘటన ఇంకా బాధితులను వెంటాడుతూనే ఉంది. తాజాగా రాజేంద్రనగర్‌కు చెందిన పిచ్చుకల నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఈ మరణంతో మృతుల సంఖ్య 15కి చేరింది. ఇప్పటికీ ఇంకా ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.