పెండింగ్‌లో ఉన్న పనులపై ఎమ్మెల్యే విజ్ఞప్తి

E.G: పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి నగరంలో పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. శుక్రవారం నగరానికి వచ్చిన పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్‌ను మున్సిపల్ కార్యాలయంలో కలిసి, నగరంలోని ప్రధాన డ్రైనేజీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని వివరించారు.