నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కృష్ణా: గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ అధికారులు వెల్లడించారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు గూడూరు, చిట్టిగూడూరు, తుమ్మలపాలెం, ఆకుమర్రు, కొకనారాయణపాలెం, రామరాజుపాలెం గ్రామాల్లో విద్యుత్ నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ జి. గోవిందరావు తెలిపారు.