ఘనంగా గంగాదేవి బోనాలు కళ్యాణోత్సవం

ఘనంగా గంగాదేవి బోనాలు కళ్యాణోత్సవం

జగిత్యాల: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని పెద్ద చెరువు గట్టు మీద నెలకొన్న గంగాదేవి ఆలయంలో శుక్రవారం గంగపుత్రసంఘం సభ్యులు ఘనంగా బోనాల ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో పురోహితులు చెరుకు మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు గంగా శివుని కళ్యాణోత్సవం హోమం నిర్వహించారు. చెరువులను కాపాడుకోవడమే గంగమ్మ ఉత్సవాల ప్రత్యేకత అని వారు తెలిపారు.