సరుగుడు నీలగిరి, జీడి తోటల్లో భారీ అగ్నిప్రమాదం

సరుగుడు నీలగిరి, జీడి తోటల్లో భారీ అగ్నిప్రమాదం

AKP: కొండ శివారు ప్రాంతాల్లో సరుగుడు నీలగిరి జీడి తోటలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం రోలుగుంట మండలం కుసర్లపూడి రైతులు పచిగుళ్ల తాతాజీ, మటం బెన్నయ్య, కుండ్రపు శ్రీను, సింహాద్రి, అప్పారావు, రైతుల తోటలు 5 ఎకరాలు దగ్ధమైనట్లు తెలిపారు. ఈ ఘటన స్థలానికి అగ్నిమాపక వాహనం వెళ్లే వీలు లేక గ్రామస్తులు మంటలను ఆర్పినట్లు తెలిపారు.