డ్రోన్ సాయంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట

VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వెయ్యడానికి డ్రోన్ సహాయంతో నిఘా పెడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే బహిరంగ మద్యపానం, ధూమపానం చేస్తున్న 35మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు. డ్రోన్ ద్వారా లభించిన విజువల్స్ ఆధారంగా ఈ కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.