గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, వీటికి అలవాటు పడితే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు తప్పవని సూచించారు.