'ది ఆదర్శ టైలర్స్' అధ్యక్షుడిగా యర్రా శ్రీనివాస్
E.G: రాజమండ్రి "ది ఆదర్శ టైలర్స్' ప్రాథమిక సహాకార సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. పాత సోమాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన టైలర్స్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆదర్శ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా యర్రా శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూర్వ అధ్యక్షుడు అడ్డాలనాగేశ్వరరావు శ్రీనుని అభినందించారు.