'మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం'

'మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం'

NLR: మత్స్యకారుల నిర్ణయాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన జువ్వలదిన్నె మత్స్యకారుల సమస్యలు, అక్రమ బోట్ల నివారణపై ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి కృషి చేస్తుందన్నారు.