వేసవిలో ఆర్టీసీ మెరుగైన సేవలు అందించాలి: కాంగ్రెస్
PPM: వేసవి కాలంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, లీగల్ సెల్ కోఆర్డినేటర్ కోళ్ల కిరణ్ కుమార్ తదితరులు జిల్లా రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, కాలం చెల్లిన డొక్కు బస్సులను తొలగించాలన్నారు.