సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు
PDPL: రామగుండంలో 800 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించడం పట్ల గోదావరిఖని పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. నాయకులు బొంతల రాజేష్, దీటి బాలరాజు మాట్లాడుతూ.. ప్లాంటు ఏర్పాటు వల్ల స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.