VIDEO: మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

VIDEO: మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

RR: మద్యం లారీ బోల్తా పడిన ఘటన మొయినాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. చిలుకూరు గ్రామం వద్ద మద్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డుపై మద్యం బాటిళ్లు పడిపోయాయి. మద్యం డిపో నుంచి వైన్ షాప్‌కు మద్యం లోడుతో వెళ్తుండగా బోల్తా పడినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.