ఎమ్మెల్యేను కలిసిన చేనేత నాయకులు

ఎమ్మెల్యేను కలిసిన చేనేత నాయకులు

కర్నూలు: ఆగస్టు 7న చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మిగనూరు పట్టణంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మిగనూరు చేనేత నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి జయ నాగేశ్వర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేనేత దినోత్సవం రోజు చేపట్టే కార్యక్రమం వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పక ఆ కార్యక్రమాన్ని హాజరుకానున్నట్టు తెలిపారు.