ప్రశాంతంగా ముగిసిన ఉల్లాస్ పరీక్ష
ASF: జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామంలో అమ్మకు అక్షర మాల ఉల్లాస్ పరీక్ష కేంద్రాన్ని డీఆర్ డీవో దత్తారాం సందర్శించారు. స్వశక్తి సంఘాల్లోని మహిళా నిరక్షరాస్యులను అక్షరాలు నేర్పించి తీర్చదిద్దే ఉల్లాస్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మహిళా నిరక్షరాస్యులను అక్షరాలు నేర్పించి తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు.