హాలీవుడ్‌లో భారతీయులపై వివక్ష: దీపికా పదుకొణె
హాలీవుడ్ ఇండస్ట్రీపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ నటీనటుల పట్ల అక్కడివారు వివక్ష చూపిస్తుంటారని తెలిపింది. హాలీవుడ్‌లో ప్రతిదీ నిజాయితీగా, సక్రమంగా ఏమీ ఉండదని ఆరోపించింది. శరీర రంగు, మన ఇంగ్లీష్ యాసపై వివక్ష చూపిస్తుంటారని పేర్కొంది. అందుకే హాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుని సక్సెస్ కావడం అంత సులభం కాదని చెప్పుకొచ్చింది.