ఆయన్ను వదిలిపెట్టం: రాహుల్ గాంధీ

ఆయన్ను వదిలిపెట్టం: రాహుల్ గాంధీ

అసోం సీఎంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ప్రజల్లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షమాపణలు కోరినా ఆయన్ను వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. హిమంత.. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.