CMRF చెక్కు అందజేసిన MLA ఆనందబాబు

CMRF చెక్కు అందజేసిన MLA ఆనందబాబు

బాపట్ల: సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేటపాలెం గ్రామానికి చెందిన కూరపాటి గోపి అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 3 లక్షల 50వేలు చెక్కును అందజేశారు.