అప్పుడు.. ఇప్పుడు.. ఒకే చోట!
TG: గతేడాది డిసెంబర్‌లోనూ మీర్జాగూడకు సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఆలూరు వద్ద రోడ్డు పక్కన ఉండే వ్యాపారులపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం జరిగిన బస్సు ప్రమాదం కూడా మీర్జాగూడకు సమీపంలోనే జరిగింది. అయితే గతంలో ప్రమాదం జరిగినప్పుడే అక్కడి రోడ్డును 4 వరుసలుగా పెంచాలని డిమాండ్లు వచ్చాయి.