పెద్దాపురంలో అథ్లెటిక్స్ పోటీలు.. విజేతలకు బహుమతులు

KKD: పెద్దాపురంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. బుధవారం మహారాణి కాలేజీలో అండర్-12, 14, 16 వయస్సు గ్రూప్ బాల బాలికలకు పోటీలు నిర్వహించారు.100 మీటర్ల లాంగ్ జంప్, షాట్ పూట్ క్రీడా పోటీలు జరిగాయి. విజేతలకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం బహుమతులు అందజేశారు.