'9వ డివిజన్ సమస్యలు పరిష్కరించాలని వినతి'

KMM: ఖమ్మం 9వ డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్పొరేటర్ షేక్ నాగుల్ మీరా శనివారం రోటరీ నగర్ లో జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగేందర్ ను కలిసి వినతిపత్రం అందించారు. 9వ డివిజన్లో అవసరమైన డ్రైన్లు, సిసి రోడ్లు నిర్మించాలని, కూరగాయల మార్కెట్ ను తిరిగి పునః ప్రారంభించాలని, కుక్కల సంరక్షణ కేంద్రాన్ని తొలగించాలని కోరారు.