VIDEO: రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే

VIDEO: రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే

కృష్ణా: యలకుర్రు గ్రామంలో ఇటీవల తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పరామర్శించారు. పంట నష్టంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైతు కష్టమంటే మన కష్టమని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి నష్టపరిహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.