కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: కేశవపట్నంలోని స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి (ఎస్.ఓ) వడ్నాల మాధవి శుక్రవారం తెలిపారు. ఆరో తరగతితో పాటు, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరాలనుకునే విద్యార్థినులు నేరుగా కళాశాలలో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. ఈ మేరకు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.