VIDEO: నిండు ప్రాణం తీసిన నింద..!

VIDEO: నిండు ప్రాణం తీసిన నింద..!

కృష్ణా: పామర్రు శివారు యడదిబ్బ గ్రామంలో ఉరి వేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కైలే యశ్వంత్ అనే యువకుడు పక్క ఇంట్లో కుక్కను తరమడానికి వెళ్తే రూ.1500 డబ్బులు తీశాడని నింద వేయడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకున్నాడు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదని.. ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యత అని బెదిరించడంతో తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తండ్రి రాజేశ్ విలపించాడు.