ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా NCC డే
NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో NCC డే ను ఇవాళ ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని NCC క్యాడెట్లు చెట్లు నాటడం, ప్రతిజ్ఞ చేయడం, ర్యాలీ తీయడం కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ.. విద్యార్థులకు NCC వల్ల క్రమశిక్షణ అలవడుతుందని సమాజంలో బాధ్యతయుతంగా క్రమశిక్షణతో మెలుగుతారని పేర్కొన్నారు.