ఆధార్ అప్‌డేట్.. ఇక ఇంటి నుంచే!
ఆధార్ కార్డ్‌లో మొబైల్ నెంబర్ మార్చాలంటే ఇకపై మీ సేవ, ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. త్వరలోనే ఈ సేవను డైరెక్ట్‌గా 'ఆధార్ యాప్'లోనే అందుబాటులోకి తెస్తున్నట్లు UIDAI వెల్లడించింది. దీంతో ఇంట్లో కూర్చునే స్మార్ట్‌ఫోన్ ద్వారా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకునే కొత్త ఫీచర్ రాబోతోంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, క్యూలో నిల్చునే సమస్య తప్పుతుంది.