మేడారం మహా జాతర మాస్టర్ ప్లాన్ సమీక్షలో మంత్రి సీతక్క

MLG: హైదరాబాద్ సచివాలయంలో బుధవారం మేడారం మహా జాతర నిర్వహణ, ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్‌లు హాజరయ్యారు.