జిల్లా కలెక్టర్‌కు 3వ ర్యాంక్

జిల్లా కలెక్టర్‌కు 3వ ర్యాంక్

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ర్యాంకులను ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పనితీరుకు సీఎం రాష్ట్ర వ్యాప్తంగా 3వ ర్యాంక్ ఇచ్చారు. ఆయన వద్దకు వచ్చిన సమస్యలలో 791 క్లియర్ చేశారు. వాటిలో ఒక్కోదానికి 18 గంటల సమయం తీసుకున్నారు. కలెక్టర్‌కు 3వ ర్యాంకు రావడంతో జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.