ఆదరించాల్సిన కొడుకే మోసం చేశాడు..!
VKB: కన్నకొడుకే అన్యాయం చేస్తున్నాడంటూ కొత్తూరుకు చెందిన పద్మమ్మ అనే మహిళ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తనకున్న ఎకరం భూమిని కుమారుడు కాశప్ప మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భూమి తీసుకున్నాక ఇప్పుడు తల్లీకూతుళ్లను పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఆమె అధికారులను వేడుకున్నారు.