ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NZB: బిక్కనూర్ మండలం బస్వాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ మెరుగైన విద్యాబోధన అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి పాల్గొన్నారు.