ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో భోజనం చేసిన మంత్రి
NRML: బాసర ట్రిపుల్ ఐటీని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ, ఎదురవుతున్న ఇబ్బందులు, బోధన తీరుపై ఆరా తీశారు. క్యాంపస్‌లోని పరిస్థితులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వీరితో పాటు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు.