హార్బర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
VSP: హార్బర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ను విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ రికార్డులు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించి, నిర్వహణపై తగు సూచనలు చేశారు.