జగన్‌కు మాట్లాడే అర్హత లేదు: మంత్రి సవిత
AP: రైతులు, బీసీలపై వైసీపీ అధినేత జగన్‌కు మాట్లాడే అర్హత లేదని మంత్రి సవిత మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా వాటి దారులు తాడేపల్లి ప్యాలెస్‌కు చూపిస్తున్నాయని ఆరోపించారు. తుఫాన్ వచ్చినప్పుడు బెంగళూరులో దాక్కున్న జగన్.. ప్రజలంతా సురక్షితంగా ఉన్నప్పుడు బయటకు వచ్చి వారిని పరామర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో బీసీలపై దాడులు జరిగాయని మండిపడ్డారు.