విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు.!

విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు.!

NTR: భవానీపురంలో బుధవారం 42 ఫ్లాట్ల కూల్చివేత పనులను అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ చేపట్టారు. దీంతో రోడ్డున పడ్డ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గత 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో బాధితులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.