యువత బీసీవై పార్టీలోకి చేరిక

కర్నూలు: బీసీవై పార్టీలోకి శుక్రవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ సమక్షంలో పార్టీ కార్యాలయంలో యువత పెద్ద ఎత్తున చేరారు. బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల మ్యానిఫెస్టో నచ్చి పార్టీలో చేరుతున్నట్లు యువత తెలిపారు. పార్టీలో చేరిన యువతకు మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ కండువా కప్పి ఆహ్వానించారు.