గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీలు

గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీలు

కృష్ణా: గుడివాడ రూరల్ మండలం మోటూరు గురుకుల పాఠశాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తనిఖీ ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగది పరిసరాలు అత్యంత అశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో జిల్లా కోఆర్డినేటర్ మురళీకృష్ణకు వీడియో కాల్ ద్వారా అక్కడి దుస్థితిని చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిశుభ్రత చర్యలు చేపట్టి, వంట సిబ్బంది కొరతను తీర్చాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవన్నారు.