ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో

NRML: విద్యార్థులకు మంచి విద్యతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన బీజనం అందించాలని కడెం ఎంపీడీవో సునీత సూచించారు. సోమవారం కడెం మండలంలోని పెద్దూరు గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.