ALERT: రేపు ఈ ప్రాంతాల్లో వర్షాలు

ALERT: రేపు ఈ ప్రాంతాల్లో వర్షాలు

AP: ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. దీంతో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రేపు శ్రీకాకుళం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నాయి.