విశాఖ చేరుకున్న టీమిండియా
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 6న విశాఖపట్నం వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇవాళ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో రాడిసన్ బ్లూ హోటల్‌కు బయలుదేరాయి. రేపటి నుంచి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి. కాగా, ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి.