23కు చేరిన మృతుల సంఖ్య
బంగ్లాదేశ్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు పడ్మా నదిలో పడడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 23కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. నది నుంచి వీరి మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా చనిపోయిన సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.