అభ్యర్థులు మోసపోవద్దని బోర్డులు ఏర్పాటు
HNK: అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మోసపూరిత మాటలను నమ్మవద్దని ఆర్మీ అధికారులు హెచ్చరించారు. HNK జేఎన్ స్టేడియం ప్రధాన గేటు వద్ద అభ్యర్థుల కోసం సూచనల బోర్డులు ఏర్పాటు చేశారు. నియామకాలకు ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని బోర్డులో స్పష్టం చేశారు.