జాతీయ పతాకంతో శివుడికి పూజలు

RR: షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కిషన్ నగర్ గ్రామంలో నెలకొన్న శివాలయంలో శివుడికి ప్రముఖ పండితులు మహదేవ్ శుక్రవారం పూజలు నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శివలింగాన్ని జాతీయ పతాకంతో అలంకరించి తన దేశభక్తిని చాటుకున్నారు. శివుడిని దేశ జాతీయ జెండాతో అలంకరించి దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.